Weekly Horoscope: ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..! | Weekly Horoscope From 03-11-24 To 09-11-24 In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Published Sun, Nov 3 2024 6:49 AM | Last Updated on Sun, Nov 3 2024 10:29 AM

Weekly Horoscope From 03-11-24 To 09-11-24 In Telugu

మేషం
కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్తిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. నేరేడు, గులాబీ రంగులు.  దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం
రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం
ఎటువంటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థైరం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు.   నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. మీఅభిప్రాయాలు కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. . దత్తాత్రేయ స్తోత్రాలు  పఠించండి.

సింహం
పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. చర్చలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం.  ఆకుపచ్చ, లేత పసుపు రంగులు.  శివపంచాక్షరి పఠించండి.

కన్య
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం మధ్యలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల
అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది.  విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు.  శివాష్టకం పఠించండి.

వృశ్చికం
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. లేత నీలం, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠనం ఉత్తమం.

ధనుస్సు
పనుల్లో విజయం సా«ధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మకరం
వీరికి పట్టింది బంగారంగా ఉంటుంది. కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అభిమానులు పెరుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, లేత గులాబీ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

కుంభం
అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో ఖర్చులు. కుటుంబసమస్యలు. లేత పసుపు, తెలుపు రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం
ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అయినా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమించి ముందుకు సాగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వివాహాది శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement