Weekly Horoscope: ఈ రాశివారికి ఈ వారం తిరుగులేదు.. శుభవార్త వింటారు | Weekly Horoscope From 08 09 2024 To 14 09 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశివారికి ఈ వారం తిరుగులేదు.. శుభవార్త వింటారు

Published Sun, Sep 8 2024 7:22 AM | Last Updated on Sun, Sep 8 2024 11:04 AM

Weekly Horoscope From 08 09 2024 To 14 09 2024 In Telugu

మేషం: ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. ధనవ్యయం. నీలం, చాక్లెట్‌ రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. వారం  చివరిలో ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  శివపంచాక్షరి పఠించండి.

మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. ఎరుపు, పసుపు రంగులు,. ఆంజనేయదండకం పఠించండి..

కర్కాటకం: ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్నరీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం.  వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఆప్తులతో కలహాలు. ఎరుపు, లేత పసుపు రంగులు, దేవీస్తుతి మంచిది.

సింహం: పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల సేవలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.  రాజకీయవర్గాలకు సన్మానయోగం.వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ధనవ్యయం. గులాబీ, చాక్లెట్‌ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేస్తారు.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక «ధనలాభం. విందువినోదాలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు,  దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: అనుకున్న కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటారు. దూరపు బం«ధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.  కళాకారులకు చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్నేహితుల ద్వారా ఒత్తిడులు. మానసిక ఆందోళన.   పసుపు, నేరేడు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. క్రీడాకారులు, రాజకీయవేత్తలకుు కొత్త అవకాశాలు రావచ్చు. వారం చివరిలో కొంత నిరాశకు లోనవుతారు. ఆర్థికంగా ఇబ్బందులు. మిత్రులతో వివాదాలు.. లేత ఎరుపు, చాక్లెట్‌రంగులు,  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో వివాదాలు సర్దుకుంటాయి.. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు.వారం చివరిలో బంధువుల ద్వారా విమర్శలు. ప్రయాణాలలో అవాంతరాలు. ఖర్చులు అధికం.  లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు,  గణేశాష్టకం పఠించండి.

కుంభం: యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు లక్ష్యసాధన దిశగా సాగుతారు.. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అంచనాలు తారుమారు. తెలుపు, చాక్లెట్‌రంగులు,  లక్ష్మీస్తుతి మంచిది.

మీనం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో అంచనాలు తప్పుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.  ఆకుపచ్చ, తెలుపురంగులు, దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement