ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం | Weekly Telugu Horoscope On Mar 3rd To 9th, 2023: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం

Published Sun, Mar 3 2024 6:51 AM | Last Updated on Sun, Mar 3 2024 11:12 AM

Weekly Horoscope In Telugu From 03-03-24 To 09-03-24 - Sakshi

మేషం..
బంధువుల చేయూతతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి.  వారం  ప్రారంభంలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.

వృషభం..
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. వాహన, గృహయోగాలు. ప్రముఖులతో పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం  కంటే  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. గులాబీ, నీలం రంగులు.  అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం..
కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు, వస్త్రలాభాలు కలుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం..
ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు, అయితే పట్టుదలతో వాటిని అ«ధిగమిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలించి రుణాలు తీరుస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు.  తీర్థయాత్రలు చేస్తారు.  భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే ఛాన్స్‌. కళారంగం వారి యత్నాలు సఫలం. పురస్కారాలు పొందుతారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో వివాదాలు. పసుపు, నీలం రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. 

సింహం..
చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలను స్వశక్తితో పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.  వ్యాపారాలు మొదట్లో కొంత మందగించినా క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరిగేవీలుంది. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య..
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేషంగా గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి.  విద్యార్థులకు మరింత అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవర్గాలు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. కళారంగం వారు అనుకోని అవకాశాలు లభిస్తాయి.  వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

తుల..
ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్థిరాస్తి వివాదాలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఒక సమాచారం కొంత గందరగోళం పెట్టవచ్చు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
ఆర్థిక లావాదేవీలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. బంధువుల సూచనలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు  లాభిస్తాయి. ఉద్యోగాలలో  కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు  కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం  చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి. 

ధనుస్సు..
ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు కొంత వరకూ అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్తిరాస్థి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు సైతం సాయపడి ప్రశంసలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం చాలావరకూ తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం..
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి.రిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం..
కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు.. భూముల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. రహస్య విషయాలు తెలుసుకుంటారు.  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.  రాజకీయరంగం వారికి కొత్త  పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  విష్ణుధ్యానం మంచిది.

మీనం..
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు, పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement