Weekly Horoscope Telugu: 05-03-2023 To 11-03-2023 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope: వారంలో ఈ రాశి వారికి శుభవార్త అందుతుంది, ధనలాభం

Published Sun, Mar 5 2023 6:59 AM | Last Updated on Sun, Mar 5 2023 10:27 AM

Weekly Horoscope Telugu 05-03-2023 To 11-03-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

వృషభం కృత్తిక 2,3,4 పా, రోహిణి 1,2 పా.)
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయపడతారు.  రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి.  పారిశ్రామికవర్గాల వారు కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. రావలసిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. లాభాలు అంతగా కనిపించవు.ఉద్యోగులు ఉన్నతస్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది.  పనిభారం పెరుగుతుంది. వారం మధ్యలో విందువినోదాలు. భూలాభాలు. కార్యసిద్ధి. నీలం, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు  ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు. తెలుపు, గులాబీ రంగులు అనుకూలం.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది.  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు గతం నుండి వస్తున్న సమస్యలు తీరతాయి.  రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో  వృథా ధనవ్యయం. సోదరులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు అనుకూలం.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. . కుటుంబంలో శుభకార్యాలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగులు  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారి చిరకాల స్వప్నం నెరవేరుతుంది.  పసుపు, ఆకుపచ్చ రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసమస్యల నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో రావలసిన బకాయిలు అందుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు.  వారం చివరిలో మానసిక ఆందోళన. ధనవ్యయం. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు.  పారిశ్రామికవర్గాలు విదేశీ పర్యటనలు జరుపుతారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు గతంలో చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు అనుకూలం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో  విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థలు ప్రారంభిస్తారు. వారం మధ్యలో శ్రమాధిక్యం. నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం.  ఉద్యోగాలలో విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని  పదవులు దక్కుతాయి.  ఆకుపచ్చ రంగు అనుకూలం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. బాకీలు సకాలంలో అందుకుంటారు. వ్యాపారాలు  మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. కళారంగం వారికి చికాకులు. గులాబీ, తెలుపు రంగులు అనుకూలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement