ఈ రాశివారు ఈ వారంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు | Weekly Horoscope Telugu 05 11 2023 To 11 11 2023 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారు ఈ వారంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు

Published Sun, Nov 5 2023 6:30 AM | Last Updated on Sun, Nov 5 2023 10:19 AM

Weekly Horoscope Telugu 05 11 2023 To 11 11 2023 - Sakshi

మేషం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. గృహం కొనుగోలు, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం.  తీర్థయాత్రలు చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతారు. ఆప్తులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.  పనులు ముందుకు సాగక డీలా పడతారు.  మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలలో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. విందువినోదాలు. గులాబీ, లేతఆకుపచ్చ, గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: ఎంతటి పనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు.  ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు.   హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు.కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో దుబారా ఖర్చులు. మానసిక ఆందోళన. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోతగిన మార్పులు కనిపించవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. వారం చివరిలో శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. పసుపు, నీలం రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి..

వృశ్చికం: అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశయాలు సాధనలో మిత్రులు చేయూతనిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. ఎరుపు, లేత పసుపు రంగులు.  శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. భూములకు సంబంధించిన కొన్ని అగ్రిమెంట్లు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. సోదరులతో సఖ్యత. వ్యాపార లావాదేవీలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, తెలుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం: ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సంస్థల ఏర్పాటులో నిమగ్నమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకూ గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమస్థాయిలో కొనసాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృధా ధనవ్యయం. అనారోగ్యం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు  ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అవసరాలకు ఎవరో ఒకరు ఆదుకుంటారు. ఆప్తులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  ఆస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి.   వారం చివరిలో అనుకోని ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.

మీనం: కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు సైతం అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement