
మేషం
విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టర్లకు ఊహించని టెండర్లు దక్కుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. సూర్యాష్టకం పఠించండి.
వృషభం
ఆదాయానికి మించి ఖర్చులు. ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ప్రత్యర్థుల నుంచి కూడా సమస్యలు ఎదురుకావచ్చు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారులకు సామాన్య లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.
మిథునం
మొదట్లో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న రాబడి సమకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. బంధువుల ద్వారా ఆస్తిలాభం. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి వారి సహాయం అందుతుంది. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు మరింత అనుకూలం వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆదాయం ఆశాజనకం. అనుకున్న కార్యక్రమాలు విజయవంతం. ఇంటి నిర్మాణప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రాగలవు. కళాకారులకు సన్మానాలు, విశేష గుర్తింపు. వారం ప్రారంభంలో వివాదాలు. ఆరోగ్యం సహకరించదు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.
కన్య
కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురైనా క్రమేపీ అనుకూలత ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో వృథా ఖర్చులు. శ్రమ పెరుగుతుంది.ఆకుపచ్చ, తెలుపు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
తుల
ఆశించిన ఆదాయం సమకూరుతుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. యత్నకార్యసిద్ధి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే సూచనలు. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. ప్రారంభంలో ఖర్చులు అధికం. సోదరులతో కలహాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న కార్యాలు చక్కదిద్దుతారు. విద్యార్థుల జీవితాశయం సఫలమవుతుంది. నేర్పు, చాకచక్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ధనలాభాలు. వ్యాపారులకు భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగస్తులు విధుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం
అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాల కొనుగోలు. వ్యాపారులకు మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల యత్నాలు సఫలం. వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు. గులాబీ, లేతపసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం
ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఊహించని అవకాశాలు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు అన్ని విధాలా సానుకూలత. వారం ప్రారంభంలో వివాదాలు. శారీరక రుగ్మతలు. నీలం, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.
మీనం
ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కార్యజయం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. సాంకేతిక నిపుణులు, వైద్యరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఎరుపు, పసుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment