ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం

Published Sun, Oct 15 2023 6:53 AM

Weekly Horoscope Telugu 15-10-23 To 21-10-23 - Sakshi

మేషం..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో  కీలక విషయాలు చర్చిస్తారు.  పనులలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించకుంటారు.  విద్యార్థుల లక్ష్యాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో మీరు చెప్పిందే వేదంగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, కొత్త పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. తెలుపు, పసుపు రంగులు. దత్తాత్రేయుని స్మరించండి.

వృషభం..
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబంలో నిర్మొహమాటంగా వెల్లడిస్తారు.  వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు.  నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సానుకూలం. వారం చివరిలో సోదరులతో కలహాలు. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం..
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది.  ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. శుభకార్యాలరీత్యా ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు.  వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. . గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం..
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు అనుకోని విధంగా  దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు.  వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. పసుపు, ఎరుపు రంగులు. . దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం..
ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళాకారులకు అవకాశాలు మరింత దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు. నీలం, లేత ఎరుపు రంగులు.  లక్ష్మీస్తుతి మంచిది.

కన్య..
పనులు చివరిక్షణంలో  వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు  శ్రమాధిక్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత  మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.

తుల..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆప్తుల నుంచి  ఆహ్వానాలు రాగలవు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం చివరిలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, నీలం రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

వృశ్చికం..
ఆర్థిక  వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు. నిరుద్యోగుల  ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులకు అంచనాలు నిజం కాగలవు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు..
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. ఆలయాలు సందర్శిస్తారు. గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. గృహ, వాహనయోగాలు. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తారు.  వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. కళాకారులు కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. తీర్థయాత్రలు. నేరేడు, నీలం రంగులు. . దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం..
కొన్ని వివాదాలు, సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. సాంకేతిక నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఎరుపు రంగులు.. దుర్గాదేవిని పూజించండి. 

కుంభం..
రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఒక ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం ప్రార ంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం..
శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. గృహం,వాహనాలు కొనుగోలు చేస్తారు. ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధువులను కలుసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మరింతగా లాభాలు రాగలవు. ఉద్యోగాలలో ఆశించిన ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పదవులు కూడా దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు.  కనకధారాస్తోత్రాలు పఠించండి.

Advertisement
Advertisement