
మేషం: అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. కార్యసిద్ధి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
వృషభం: కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారుల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. తెలుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన చేయండి.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు గుర్తకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులు మీకు దగ్గరవుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త పోస్టులు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం: కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ వృథా కాదు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
సింహం: శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనులలో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఓర్పు, నేర్పుగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు ఆశించినరీతిలో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. భూవివాదాలు. గులాబీ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య: మీ అభిప్రాయాలు, మనోగతాన్ని కుటుంబసభ్యులు మన్నిస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల ద్వారా కొంత సహాయసహకారాలు అందుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
తుల: కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నీలం, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
వృశ్చికం: అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. కళాకారుల యత్నాలు సఫలీకతమవుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
ధనుస్సు: కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదల, నేర్పుతో పరిష్కరించుకుంటారు. మీ ప్రతిభాపాటవాలు అందరూ గుర్తిస్తారు. సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ ఆశయాల సాధనలో బంధువర్గం సహకరిస్తుంది. ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు కలసివచ్చే సమయం. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
మకరం: పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో లేనిపోని సమస్యలు. కుటుంబంలో చికాకులు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
కుంభం: ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ధనలబ్ధి. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment