Weekly Horoscope 24 April to 30 April 2022 In Telugu: Vaara Phalalu 24-04-2022 To 30-04-2022 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope in Telugu: 24 ఏప్రిల్‌ నుంచి 30 ఏప్రిల్‌ 2022 వరకు

Published Sun, Apr 24 2022 6:17 AM | Last Updated on Sun, Apr 24 2022 11:18 AM

Weekly Horoscope In Telugu 24-04-2022 To 30-04-2022 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆత్మబలం, పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుని తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా దృఢవిశ్వాసంతో అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల వారికి అన్ని విధాలా అనుకూల పరిస్థితి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
మీరు చేపట్టిన పనులు మీ ప్రమేయం లేకుండానే పూర్తి కాగలవు. ఆర్థికంగా మునుపటి కంటే బలం పుంజుకుని రుణవిముక్తి పొందుతారు. గతం నుంచి మీకు దూరంగా ఉన్న బంధువులు దగ్గరవుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో కొంత నిరుత్సాహంతో ప్రారంభమైనా క్రమేపీ ఉత్సాహం కలుగుతుంది. ముఖ్య వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎంతోకాలంగా ఉన్న భూవివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుని మీదారికి తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఏర్పడినా పట్టుదలతో అ«ధిగమిస్తారు. మీ ఆలోచనలు అందరికీ ఉపయోగకరంగా మారతాయి. ఆర్థికంగా బలం చేకూరి ఇతరులకు సైతం సాయం అందిస్తారు. ఇంటి నిర్మాణాలకు సన్నాహాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మీ సమస్యలు కొన్ని అవలీలగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. ధైర్యం, ఓర్పుతో ముందడుగు వేసి విజయాలతీరం చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పరిస్థితులను బేరీజు వేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ఏ వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా కొనసాగుతుంది. సన్నిహితుల సహాయం అందుకుని కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. తెలుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
సమస్యలకు ఎదురీది అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉండవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక నిరాశ చెందుతారు. బంధువులతో కొన్ని వివాదాలు నెలకొని మీకు పరీక్షగా నిలుస్తాయి. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేక సతమతమవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. ఉద్యోగాలలో మరింత సమర్థనీయంగా పనిచేయాల్సి ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు. .పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మీ సమర్థతకు బంధువులు కూడా ఆశ్చర్యపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాల మధ్యలో కొంత నిరాశ పర్చినా లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త వ్యవహారాలు ప్రారంభం నుంచీ విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై ఆర్థికంగా బలపడతారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఊరట చెందుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశారాధన మంచిది.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇతరులకు సైతం సాయం అందించడం ద్వారా ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తృతం చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి.

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement