రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మేదరమెట్ల: బైక్‌ను పాల ట్యాంకర్ ఢీకొనడంతో భార్యాభర్తలు గాయపడ్డారు. వెంకటాపురం క్రాస్ రోడ్డు సమీపంలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొండమూరు గ్రామానికి చెందిన ఓరుగంటి అంజిరెడ్డి భార్యతో కలిసి బైకుపై ఒంగోలు నుంచి స్వగ్రామం వెళుతున్నారు. వెంకటాపురం క్రాస్ రోడ్డు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్ బైక్‌ను బలంగా ఢీకొంది. భార్యాభర్తలను అంబులెన్స్‌లో ఒంగోలు కిమ్స్ వైద్యశాలకు తరలించినట్లు మేదరమెట్ల పోలీసులు తెలిపారు.
జె.పంగులూరులో..
టైరు పగిలి ఆగి ఉన్న వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి బైటమంజులూరు జాతీయ రహదారిపై జరిగింది. అద్దంకి మండలం వెంకటాపురం నుంచి పొగాకు చెక్కులతో వ్యాన్ బయలు దేరింది. బైటమంజులూరు సమీపంలో టైరు పగిలిపోగా రోడ్డుపై ఆగింది. ఆదే సమయంలో మైసూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీని నడుపుతున్న బాలకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment