నృసింహునికి బ్రహ్మరథం
మంగళగిరి/మంగళగిరి టౌన్: జై నారసింహా.. జైజై నారసింహా నినాదాలతో మంగళగిరి శుక్రవారం మార్మోగింది. శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు 11 రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామి కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలకు ఉభయదేవరులతో స్వామి దివ్యరథాన్ని అధిరోహించారు. మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. గాలిగోపురం నుంచి దక్షిణాభిముఖంగా ప్రారంభమైన రథం మెయిన్‌బజార్ మిద్దె సెంటర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు కదలింది. అక్కడ ఆంజనేయస్వామి, వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం తిరిగి రథోత్సవం గాలిగోపురం వద్దకు చేరుకుంది. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాఢ భూషి వేదాంతచార్యులు వ్యవహరించారు. పద్మశాలీయ శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథ చప్పాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో ఎ.రామకోటిరెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి రథాన్ని కొద్దిసేపు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాగారు.
బంగారు గరుడోత్సవం
గురువార రాత్రి స్వామి కల్యాణోత్సవం అనంతరం స్వామికి బంగారు గరుడోత్సవం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సమారాధన నిర్వహించారు. గరుడోత్సవం శాశ్వత కల్యాణ కై ంకర్యపరులుగా వాసిరెడ్డి సీతారామయ్య కుమారలు జయదత్తు, ప్రభునాథ్‌లు వ్యవహరించగా బ్రాహ్మణ సమారాధన శాశ్వత కై ంకర్యపరులుగా అరిపిరాల చిన్నఅప్పయ్య శాస్త్రి, మొక్కపాటి ఆనందయ్యలు వ్యవహించారు.
మంగళాద్రిపై కొలువుదీరిన ఉగ్ర నారసింహుడు ఆనంద గర్జన చేస్తూ రథారూఢుడైనట్టు.. చెంతనున్న కృష్ణమ్మ జన ప్రవాహమై పురవీధుల్లో పోటెత్తినట్టు.. అష్టదిక్పాలకుల జయజయధ్వానాలతో దక్షిణాభిముఖంగా కదిలినట్టు.. మంగళగిరి నగరం ఆధ్యాత్మికోత్సాహంలో ఓలలాడింది. లక్ష్మీ నరసింహుని రథోత్సవానికి బ్రహ్మరథం పట్టింది.
నమో నారసింహా
మంగళాద్రి.. ‘జన’దాద్రి
అంగరంగ వైభవంగా
నృసింహుని దివ్యరథోత్సవం
నృసింహునికి బ్రహ్మరథం
Comments
Please login to add a commentAdd a comment