అమరేశ్వరుని సేవలో ఉప లోకాయుక్త
అమరావతి: ప్రముఖశైవక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుణ్ణి ఉప లోకాయుక్త జస్టిస్ రజని దంపతులు శనివారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు జస్టిస్ రజని దంపతులకు స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జస్టిస్ రజని దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నృసింహుని సేవలో..
మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాష్ట్ర ఉప లోకాయుక్త జస్టిస్ రజిని దంపతులు దర్శించుకున్నారు. ఎగువ దిగువ సన్నిధులలో స్వామిని దర్శించుకున్న దంపతులకు ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏ. రామకోటిరెడ్డి, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర ఘనంగా స్వాగతం పలికారు. రజిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్లాస్టిక్ రహిత
గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
కారంచేడు: మన గ్రామాలను ప్లాస్టిక్, కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మన వంతు కృషి చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని బాపట్ల జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డీ విజయలక్ష్మి అన్నారు. శనివారం ఆమె మండలంలోని కారంచేడు, స్వర్ణ గ్రామాల్లో జరుగుతున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని ఆమె వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులతో మాట్లాడారు. కారంచేడు గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆమె పరిశీలించారు. కార్యాలయాలను శుభ్రపరిచే కార్యక్రమంలోను పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం, అమ్మకాలను నిషేధించాలని ఆమె దుకాణ యజమానులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి గుడ్డ సంచులను వెంట తెచ్చుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. చినవంతెన సెంటర్‌లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులతో మానవహారం నిర్వహించి, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్వర్ణ గ్రామంలో ఆమె అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు జే నాగరాజు, ఎంపీడీఓ కే నేతాజీ, హౌసింగ్ ఏఈ ఖాశీం సాహెబ్, వైద్యశాఖ, పంచాయతీ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవారి కల్యాణం
నగరంపాలెం:గుంటూరు ఆర్.అగ్రహారంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివా రం ప్రాతఃకాల ఆరాధన, స్వామికి తిరుమంజ న స్నపన, అలంకార పూజ, నిత్యార్చన, నిత్య హోమం, బలిహరణ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమే త వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు భక్తిప్రపత్తులతో చేపట్టారు. భక్తులు పెద్దసంఖ్యలో తిలకించారు. ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. స్వామివారి రథోత్స వం భక్తుల గోవింద నామస్మరణతో ఆర్.అగ్రహారం ప్రధాన వీధుల్లో కొనసాగింది. మంగళవాయిద్యాలు, డప్పులు, దేవతామూర్తుల వేషధారణలతో రథోత్సవం ఆకట్టుకుంది. ఆలయ వ్యవస్థాపకులు కన్నా లక్ష్మీనారాయణ, కార్యదర్శులు పాల్గొన్నారు.
అమరేశ్వరుని సేవలో ఉప లోకాయుక్త
అమరేశ్వరుని సేవలో ఉప లోకాయుక్త
Comments
Please login to add a commentAdd a comment