ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
బాపట్ల: ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహ న కల్పించాలని రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా అన్నారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించిందన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ ప్రభు త్వం ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు జయప్రదానికి ప్రజల భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తడి, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసే విషయంపై మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. సేకరించిన తడి, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను చెత్త సంపద తయారీ కేంద్రానికి తరలించాలన్నారు. చెత్త సేకరించే సమయంలోనే వేర్వేరుగా చేసి తిరిగి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 17 లక్షల మంది ప్రజలు ఉన్నారని, వీరి కోసం ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అన్నారు. సూర్యలంక బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా
Comments
Please login to add a commentAdd a comment