రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మేదరమెట్ల: వేర్వేరు ప్రమాదాల్లో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో ఇరువురికి స్వల్పగాయాలైన సంఘటన కొరిశపాడు మండల పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు అద్దంకి రోడ్డులోని కొంగపాడు డొంక సమీపంలో బైకుపై వస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఇతన్ని 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రగాయాలైన వ్యక్తి తాళ్లూరుకు చెందిన పాలపర్తి నగేష్ ఇతను శింగరకొండ తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండనా ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
మేదరమెట్ల భ్రమర వెంచర్ ఎదురు బైకుపై వెళుతున్న ఇద్దరు రోడ్డు ప్రక్కన బైకు ఆపి కాలకృత్యాలు తీర్చుకొని బైకు వద్ద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన మరో బైకు వీరిని ఢీ కొంది. దీంతో నిలబడి ఉన్న లింగారావు, సుబ్బారావులకు గాయాలు కాగా వీరిని వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైకు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
Comments
Please login to add a commentAdd a comment