ప్రసన్నాంజనేయ స్వామి ఆదాయం రూ.14.25 లక్షలు
అద్దంకి రూరల్: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆదాయం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గణనీయం పెరిగినట్లు దేవస్థానం ఏసీ యం. తిమ్మనాయుడు శనివారం తెలిపారు. శనివారం దేవస్థానంలో భక్తులు వేసిన కానుకల హుండీని లెక్కించగా రూ.14,25,272, ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే దాతల నుంచి అన్నదానానికి రూ.12,939, తిరునాళ్ల సందర్భంగా టికెట్ల ద్వారా రూ.10,04,491 వచ్చినట్లు తెలిపారు. గత సంవత్సరం టికెట్లు ద్వారా రూ.8,26,435, హుండీ ద్వారా రూ.8,26,081 వచ్చినట్లు తెలిపారు.
లక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.2.66 లక్షలు
శింగరకొండ కొండపైన కొలువై ఉన్న క్షేత్రపాలకుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆదాయం రూ.2,66,604 వచ్చినట్లు ఏసీ కోటిరెడ్డి తెలిపారు. 15 రోజులకు భక్తులు వేసిన కానుకల హుండీని శనివారం లెక్కించగా రూ.1,38,334, తిరునాళ్ల సందర్భంగా పూజా టికెట్ల వలన 1,28,270 ఆదాయం వచ్చినట్లు తెలి పారు. గత సంవత్సరం హుండీ వలన రూ.89,974, పూజా టికెట్లు వలన రూ.1,05,350 సమకూరింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అదనంగా రూ.71,280 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వెంటేశ్వరరావు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆదాయం రూ. 2.86 లక్షలు
శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా అద్దంకి ఆర్టీసీ డిపోకు రూ.2,86,920 ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్ బెల్లం రామ్మోహనరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిపో నుంచి 24 బస్సులు నడిపినట్లు వివరించారు. గత సంవత్సరం రూ.2,06,940 రాగా ఈ సంవత్సరం అదనంగా రూ. 80 వేలు అదనంగా వచ్చినట్లు తెలిపారు.
ప్రసన్నాంజనేయ స్వామి ఆదాయం రూ.14.25 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment