ఘనంగా గోపుర శిఖర సహిత పునఃప్రతిష్టా మహోత్సవం
గొరిగపూడి(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం గొరిగపూడి గ్రామంలోని శ్రీ భ్రమరి దుర్గాదేవి సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానం జీవ ధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్టా మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి హోమాలు, ప్రాతఃకాల దీక్ష హోమాలు, అనంతరం దేవతామూర్తులు, గోపుర శిఖరాలు, ధ్వజ ప్రతిష్ట పూజ, కుంభాభిషేకం నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు. రూ.1.10 కోట్ల వ్యయంతో జీవ ధ్వజ విమాన గోపుర శిఖర సహిత పునః ప్రతిష్టా కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున రూ.25 లక్షలు దేవదాయ శాఖకు, రూ.75 లక్షలు వ్యయంతో దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పూర్వ గ్రామకరణం, పులిగడ్డ వారి వంశస్తులు రూ.10 లక్షల విగ్రహాలను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం శాంతి కల్యాణం, అనంతరం అన్న సంతర్పణ జరగనున్నాయి. ఫణికుమార్ ఆధ్వర్యంలో పూర్వ గ్రామకరణం, పులిగడ్డ వారి వంశస్తుల సహాయ సహకారాలతో బ్రహ్మశ్రీ సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య అర్చక పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సర్పంచ్ గరికపాటి మల్లికా–వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు ఆమంచి సృజన్‌కుమార్, కార్యనిర్వాహణాధికారి పాపని రాజేశ్వరరావులు కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, దేవదాయ ధర్మ శాఖ అధికారులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment