పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం
అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్
బాపట్ల టౌన్: పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 124 వ జయంతిని ఆదివారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణ త్యాగం చేసిన ఘనుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, పలుమార్లు జైలుకు వెళ్లిన గాంధేయవాది అన్నారు. ఆంధ్రుల కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఖ్యాతిని ప్రతి తెలుగు వారు గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం అహర్నిశలు కృషి చేయాలని యువతకు ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ నారాయణ, ఆర్‌ఎస్‌ఐ సుధాకర్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment