పేద ఖైదీలకు ఉచిత న్యాయసహాయం
సత్తెనపల్లి: ఆర్థిక స్తోమత లేని పేద రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియావుద్దీన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను, ఆహారం, దానికి ఉపయోగించే సరుకుల నాణ్యతను పరిశీలించారు. అంతేకాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలించి అన్ని అంశాల పై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్ రెడ్డి, సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, ప్యానల్ న్యాయవాది బి.ఎల్.కోటేశ్వరరావు, సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం, తదితరులు ఉన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి సత్తెనపల్లి సబ్‌జైలు సందర్శన
Comments
Please login to add a commentAdd a comment