ఉమ్మారెడ్డి గృహ ప్రవేశానికి సజ్జల హాజరు
స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కార్యక్రమానికి హాజరైన అందరినీ పలకరించారు. అంతకు ముందు బాపట్ల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు సజ్జలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాగితపు సుధీర్‌బాబు, మండల అధ్యక్షుడు ఎం.కొండలరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఆర్టీఐ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జోగి రాజా, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోహిత్ పాల్గొన్నారు. తొలుత ఆయనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment