శింగరకొండలోపుల్లెల గోపీచంద్ పూజలు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి, వారిని ఆశీర్వదించారు.
పల్నాడు జిల్లా డీఆర్‌డీఏ పీడీ
బాధ్యతలు స్వీకరణ
నరసరావుపేట: పల్నాడు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా ఝాన్సీరాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ఒంగోలు జిల్లాలో విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. కలెక్టర్ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన బాలూనాయక్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
గేట్‌లో జశ్వంత్ భవానీకి 6వ ర్యాంక్
నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2025 పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన పెంటేల జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించాడు. జశ్వంత్ భవాని తండ్రి రాజశేఖర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ముంబైలో 5జీ సిస్టమ్ ఇంజినీర్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గేట్ పరీక్షలకు జశ్వంత్ సిద్ధం అయ్యాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. ఇందులో దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జశ్వంత్ భవాని 6వ ర్యాంక్ సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేశారు.
1,27,005 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్ యార్డుకు బుధవారం 1,27,005 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,24,077 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 – రూ.14,500 వరకు పలికింది.
శింగరకొండలోపుల్లెల గోపీచంద్ పూజలు
శింగరకొండలోపుల్లెల గోపీచంద్ పూజలు
Comments
Please login to add a commentAdd a comment