పార్థసారఽథి అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం పార్థసారఽథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు.
నేడు శ్రీరంగనాయకులు అలంకారం...
లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment