
ఏఎఫ్‌డబ్ల్యూఎల్ ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ
గుంటూరు లీగల్: ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ (ఏఎఫ్‌డబ్ల్యూఎల్) దక్షిణభారత ఉపాధ్యక్షురాలిగా సోమసాని ఝాన్సీ ఎన్నికయ్యారు. బెంగళూరులో ఈనెల 23న నిర్వహించిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి తెలంగాణకు చెందిన పి.రేవతి దేవిపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పోలూరు వెంకటరెడ్డి, సిడి భగవాన్, ఒట్టి జొన్నల బ్రహ్మరెడ్డి, కాసు వెంకట్రెడ్డి, కళ్ళం రమణారెడ్డి, కృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు ఝాన్సీకి అభినందనలు తెలిపారు. ఝాన్సీ గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యురాలు కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా కె.శాంతకుమారి(తమిళనాడు) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ భాస్కర లక్ష్మీ, ప్రెసిడెంట్ అరుణ, ఈసీ సభ్యులు, గుంటూరు బార్ అసోసియేషన్ పూర్వ ప్రెసిడెంట్ పోలూరి వెంకట రెడ్డి, ప్రస్తుత ప్రెసిడెంట్ కాసు వెంకట రెడ్డి, బార్ కౌన్సిల్ మెంబెర్ బ్రహ్మానంద రెడ్డి, పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
ఝాన్సీ ప్రస్థానమిలా..
ఝాన్సీలక్ష్మి 2000 నుంచి న్యాయవాదిగా గుంటూరు జిల్లా కోర్ట్, హైకోర్ట్, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో పనిచేస్తున్నారు. సోమసాని బ్రహ్మానంద రెడ్డి వద్ద జూనియర్ గా పనిచేశారు. ఆమె ఆర్డీఓ ట్రిబ్యునల్ ప్యానెల్ అడ్వకేట్‌గా, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, స్టాండింగ్ కౌన్సెల్ కం స్పెషల్ పీపీపీసీఆర్ సెల్, సీఐ. డీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఫెడరేషన్ అఫ్ ఉమెన్ లాయర్స్ అఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు.
ట్రెక్కింగ్ అంటే ఆసక్తి
ఝాన్సీ లక్ష్మికి ట్రెక్కింగ్ అంటే ఆసక్తి 2024 జూన్‌లో 53 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్కింగ్ కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment