బాపట్ల
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహర్
(మంగళ) (బుధ)
బాపట్ల 6.25 4.52
నరసరావుపేట 6.27 4.54
గుంటూరు 6.25 4.52
చీరాల: ఐపీఎల్ క్రికెట్ పోటీలను చూసి కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొంతమంది తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. బెట్టింగ్ భూతం కారణంగా అప్పుల పాలవుతున్నారు. ఇంజినీరింగ్, పాఠశాలలో చదివే విద్యార్థులు సైతం పాకెట్ మనీగా తెచ్చుకున్న డబ్బులతో బెట్టింగ్‌లు పెడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్ యాప్‌లు, క్రికెట్ యాప్‌ల ద్వారానే అధికంగా పందేలు కాస్తున్నారు. చీరాలలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ కారణంగా చేతులు మారుతున్నాయి. ఇందుకు వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్దఎత్తున బుకీలుగా ఏజెంట్లు కథ నడుపుతున్నారు.
బెట్టింగ్ యాప్‌లతో మోసం
ఒకే చోట కూర్చొని బెట్టింగ్‌లు జరుగుతుంటే పోలీసులు నిఘా పెట్టి పట్టుకునేవారు. దీంతో బెట్టింగ్ బాబులు రూటు మార్చారు. బెట్ 365 అనే ఆన్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఫోన్ల ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు బెట్టింగ్ రాయుళ్లతో బంతి బంతికి, ఓవర్ ఓవర్‌కు బెట్టింగ్ కాయిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ అంతా ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా జోరుగా జరుగుతూనే ఉంది. పందెం గెలిచిన గంటల్లోనే డబ్బులు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తుండడంతో బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. బాపట్ల జిల్లాలో చీరాల, పర్చూరు. బాపట్ల కేంద్రంలో బెట్టింగ్ కోట్లాది రూపాయల్లో జరుగుతోంది.
ఎందరో ప్రాణాలు కోల్పోయారు..
● గతంలో క్రికెట్ బెట్టింగ్ కారణంగా తీవ్ర అప్పులపాలై అప్పులు తిరిగి చెల్లించలేక మానసిక వేదనతో పేరాలలోని ఓ హోటల్ యజమాని తనయుడు ఆత్మహత్యకు పాలయ్యాడు.
● గడియార స్తంభం సెంటర్‌లో మెడికల్ షాపు నిర్వాహకుడు బెట్టింగ్ కోరలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.
● పేరాలలోని ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని బెట్టింగ్ కారణంగా వదిలేసి అప్పులపాలై తనువు చాలించాడు. ఇటువంటి ఘటనలు చీరాలలో బహిర్గతం కానివి చాలా ఉన్నాయి.
బార్లే వేదికగా...
బార్ అండ్ రెస్టారెంట్లలో తమ వ్యాపారం కోసం పెడుతున్న ప్రొజెక్టర్ ద్వారా తెరలపై ఐపీఎల్ మ్యాచ్‌లను వేస్తున్నారు. అయితే చాలా మంది అనుమానం రాకుండా రెస్టారెంట్‌కు వచ్చినట్లుగా వ్యవహరిస్తూ బెట్టింగ్‌లు కాస్తున్నారు.
గ్రామాలకు పాకిన బెట్టింగ్ భూతం..
నిన్నమొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ భూతం నేడు గ్రామాలకు పాకింది. అక్కడా బుకీ ఏజెంట్లు ఏర్పడ్డారు. బెట్టింగ్‌కు అలవాటు పడిన కొందరు బుకీ ఏజెంట్లు గ్రామస్తుల నుంచి డబ్బులు, స్థిరాస్తులను సైతం వాటిపై బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా కారంచేడు, ఇంకొల్లు, పర్చూరుతో పాటు చీరాలలో కూడా పలు గ్రామాలలో ఈ బెట్టింగ్ పెద్దఎత్తున జరుగుతోంది.
చితుకుతున్న కుటుంబాలు
చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్నా, మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఊరు వదిలివెళ్లిపోతున్నారు. బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బెట్టింగ్ భూతాన్ని పోలీసులు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.
7
ఛిద్రమవుతున్న జీవితాలు గ్రామాలకు పాకిన బెట్టింగ్ భూతం జిల్లాలో కోట్లకు పెరిగిన పందేలు ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో జోరుగా పందేలు చీరాల కేంద్రంగా పెద్దఎత్తున బుకీ ఏజెంట్లు కట్టడి చేయలేని స్థితిలో ఖాకీలు
న్యూస్‌రీల్
చీరాలలో 10 మంది ఏజంట్లు
యువకులు, బంగారు వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు లక్షలాది రూపాయలు బుకీల ద్వారా పందేలు కాస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా పేరాలలో ఇద్దరు బుకీలు పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కంప్యూటర్‌తోపాటు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు బుకీల ద్వారా సమాచారం తెలుసుకుని స్థానికంగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. చీరాలలో 10 మందికి పైగా బుకీ ఏజెంట్లు ఉన్నారు. జాండ్రపేటలో ఇద్దరు, వేటపాలెంలో ఇద్దరు, ఈపూరుపాలెంలో ఇద్దరు ఏజెంట్లు, చీరాల ప్రాంతాలలో జరిగే బెట్టింగ్‌లను నడుపుతున్నారు. పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లావాదేవీలంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఫలితాన్ని బట్టి డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకం లేని వారి వద్ద ముందే డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
Comments
Please login to add a commentAdd a comment