వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
బాపట్ల: వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వలనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ జి.వి.రామాంజనేయులు పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల్లో ఆర్థిక శాస్త్ర విభాగం నిర్వహించిన సమావేశంలో డాక్టరు జి.వి.రామాంజనేయులు మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికై చేపట్టిన విధానాల రైతులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు ప్రభుత్వ విధానాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగివుండాలన్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మార్కెఫెడ్ జనరల్ మేనేజర్ సీహెచ్.శ్రీనివాసరావు మార్కెఫెడ్ రంగం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. డెయిరీ, ఫిషరీస్ వంటి వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికై ప్రభుత్వ నూతన విధానాలను కూలంకషంగా వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి, ఆర్థిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్లు డాక్టర్ కె.ఎస్.పాల్, డాక్టర్ ఎస్.హైమజ్యోతి, డాక్టర్ కె.సుశీల, డాక్టర్ బి.అపర్ణ, డాక్టర్ వి.సీతారాంబాబు, 200 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ రామాంజనేయులు