జిల్లా సెషన్స్ న్యాయాధికారి సత్యశ్రీకి పీహెచ్‌డీ
నరసరావుపేట టౌన్: స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయాధికారి నేతి సత్యశ్రీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ పట్టా అందించింది. న్యాయాధికారి ఎన్.సత్యశ్రీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతామాణిక్యం పర్యవేక్షణలో తన పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయడం, ఎన్నికలలో ప్రచారాలు, సాంకేతిక యుగంలో చట్టపరమైన నైతిక సందిగ్ధతలు అనే అంశంపై పరిశోధన చేశారు. ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ యుగంలో ఎన్నికల ప్రచారాలలో చోటు చేసుకుంటున్న అపసవ్యతలు వాటిని శాసీ్త్రయంగా సరిదిద్దుకోవడానికి తీసుకోవలసిన చర్యలు, మీడియా పాత్ర, వ్యక్తిగత స్వేచ్ఛ తదితర అంశాలను స్పృశిస్తూ ఈ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీఎస్ రాజశేఖర్ చేతులమీదుగా న్యాయశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందుకున్నట్లు ఆమె మంగళవారం తెలిపారు.