వక్ఫ్‌బోర్డు సవ‘రణం’
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై ముస్లింలు భగ్గుమన్నారు. సోమవారం అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంసీపీఐయూ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మొహిద్దీన్ బాషా రెడ్ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు భూములపై తెచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనల్లో బుజ్జిగారి ఖాదర్, మస్తాన్ పిట్టమళ్ల, ఖాసీం కొమ్మరపల్లి బుజ్జి, మోహతాజ్ బాషా, షంషుద్దీన్, హఫీజ్ కాలేషా దరియా హుస్సేన్, గొమ్మరపల్లి మీరా తదితరులు పాల్గొన్నారు. చీరాలలో ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నవాబుపేటలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తారు.
– చీరాలటౌన్, అద్దంకి
వక్ఫ్‌బోర్డు సవ‘రణం’


