ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి

Apr 4 2025 1:08 AM | Updated on Apr 4 2025 1:08 AM

ఎన్‌స

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి

బాపట్ల: ఎన్‌సీడీ సర్వేను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టరు ఎస్‌.విజయమ్మ వైద్యులకు సూచించారు. గురువారం స్థానిక కార్యాలయంలో వైద్యాధికారులతో ఈ సర్వేపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో వివరాలు పొందుపరచాలని సూచించారు. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య విషయాలపై ఆరా తీసి వివరాలు నమోదు చేయాలన్నారు.

వైద్యం కోసం రూ.లక్ష ఆర్థిక సాయం

బాపట్ల: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కోమట్ల ధనలక్ష్మి కుటుంబానికి కుమ్మరి కోటిరెడ్డి చారిటబుల్‌ ట్రస్టు రూ.లక్ష సాయం అందించింది. గురువారం స్థానిక మర్రిపూడిలో ధనలక్ష్మి కుటుంబ సభ్యులకు ఈ మొత్తం అందించారు. ట్రస్టు అధ్యక్షులు ఓటికుండల విజయభాస్కర్‌రెడ్డి , ఓటికుండల శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌ కార్యదర్శి ఓటికుండల లక్ష్మణరావు, కోశాధికారి కుమ్మరి అంజిరెడ్డి, సభ్యులు వేజండ్ల శ్రీనివాసరావు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు రాతమశెట్టి సత్యనారాయణ రూ.5వేలు అందజేశారు.

ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

వేమూరు: మండలంలోని చంపాడు ఇరిగేషన్‌ కాలువ వంతెన వద్ద ఇసుక ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. వివరాలు మేరకు... కొల్లూరు మండలంలోని గాజులంక నుంచి తెనాలికి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసు స్టేషన్‌లో ముడుపులు చెల్లించడంతో రాత్రి వేళ తిరిగే లారీలు, ట్రాక్టర్ల యజమానులపై పోలీసులు కేసు నమోదు లేదు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాజులంక గ్రామం నుంచి ఇసుక లోడుతో ట్రాక్టర్‌, లారీ బయలుదేరాయి. చుంపాడు ఇరిగేషన్‌ కాలువ వంతెన వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొని పడిపోయింది. వంతెన వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. అక్రమ ఇసుక విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు వచ్చి మిషన్లు ద్వారా ఇసుక లారీని తొలగించారు. సీఐ మాట్లాడుతూ స్టేషన్‌లో ఫిర్యాదు అందలేదన్నారు. కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి 1
1/2

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి 2
2/2

ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement