భార్య, అత్తపై యువకుడి దాడి
చీరాల: భార్య, అత్తలపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన గురువారం రాత్రి పేరాల మసీదు సెంటర్ సమీపంలో చోటు చేసుకుంది. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.......రేపల్లె నియోజకవర్గం అడవులదీవికి చెందిన తోకల కరుణాకర్‌కు పేరాలకు చెందిన కట్టా సంధ్యారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలం నుంచి సంధ్యారాణి పేరాల మసీదు సెంటర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కరుణాకర్ తరచుగా భార్య ఇంటికి వచ్చి గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంట్లో ఆమె తల్లి లక్ష్మి, కుమారుడు ఉన్న సమయంలో కరుణాకర్ వచ్చి గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న కత్తితో సంధ్యారాణిని పొడిచాడు. అత్త అడ్డుకోబోగా దాడి చేసి పారిపోయాడు. ఇద్దరు కేకలు వేసుకుంటూ రక్తపు గాయాలతో బయటకు రావడంతో చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు వారి నుంచి ఫిర్యాదును స్వీకరించారు. టూటౌన్ సీఐ నాగభూషణం వివరాలు సేకరించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
బాధితులు


