గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్)గా డాక్టర్ బండారు వెంకట రంగారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన డాక్టర్ బండారు కర్నూలు మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ చదివారు. 1992లో పీడాటిక్స్‌లో పీజీ వైద్య పూర్తి చేశారు. మెదక్ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు.
2009లో డెప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉద్యోగోన్నతి పొంది ప్రకాశం జిల్లా కంభంకు బదిలీ అయ్యారు. 2019లో సివిల్ సర్జన్‌గా ప్రమోషన్ పొంది మాచర్లకు బదిలీ అయ్యారు. 2014లో బాపట్ల ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2022 నుంచి పల్నాడు డీసీహెచ్‌ఎస్‌గా నరసరావుపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. గుంటూరులోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రంగారావును వైద్యులు, కార్యాలయ ఉద్యోగులు అభినందించారు.
బోయపాలెం డైట్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెం జిల్లా వృత్తి విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల్లో డెప్యూటేషన్‌పై పని చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎంఈఓలు, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు.
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలి పారు. ఈనెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈనెల 16,17వ తేదీల్లో పరీక్షలు, ఈనెల 19న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని పేర్కొ న్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డైట్‌బోయపాలెం.కామ్ సందర్శించాలని, సందేహాల నివృత్తికి 94408 46046 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తును ప్రతి సబ్జెక్టుకు వేర్వేరుగా చేయాలని, దరఖాస్తుల స్వీకరణకు గుంటూరు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జీజీహెచ్‌లో మీకోసం మేము
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో 7వ వారం మీకోసం మేము పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ పేషెంట్‌లకు హాస్పిటల్ నియమావళి గురించి సూచనలు చేశారు. ల్యాబ్ పరీక్షలు, మరేదైనా ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు మోసపోవద్దని తెలిపారు. ఎలాంటి సమస్యనైనా ఎవరికీ డబ్బు చెల్లించవద్దని, ఒకవేళ ఎవరైనా డబ్బు అడిగితే రశీదు అడగాలని, ఇవ్వని పక్షంలో సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఓంకు ఫిర్యా దు చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ద్విచక్రవాహనం ఢీ కొని మహిళ మృతి
అద్దంకి రూరల్: గేదెలు కాసుకుని ఇంటికి వెళుతున్న మహిళను ద్విచక్రవాహనం ఢీకొట్టటంతో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి అద్దంకి మండలంలో చోటుచేసుకుంది. సంఘటనకు చేరుకుని సీఐ సుబ్బరాజు, ఎస్సై ఖాదర్‌బాషా జరిగిన తీరును పరిశీలించారు. ద్విచక్రవాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాలు..
మండలంలోని కొటికలపూడి గ్రామానికి చెందిన కొటికలపూడి గ్రామానికి చెందిన మూరబోయిన కోటేశ్వరమ్మ (54)గేదెలు కాసుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా వేణుగోపాలపురం రోడ్డు వద్దకు రాగానే రజానగరం గ్రామానికి చెందిన మురళీకృష్ణ ద్విచక్రవాహనంపై అద్దంకి నుంచి రజానగరం వెళుతూ కోటేశ్వరమ్మను ఢీకొట్టాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇరువురిని 108లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రగాయాలైన కోటేశ్వరమ్మ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మురళీకృష్ణ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డీసీహెచ్‌ఎస్‌గా డాక్టర్ బండారు


