ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించాలి
అద్దంకి రూరల్: ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలు నుంచి వచ్చి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. పట్టణంలోని రోడ్లు డ్రైనేజిలకు సంబంధించినవి, దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లు, విద్యుత్ సమస్యలపై ప్రజలు నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు అందాయి. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, విద్యుత్ శాఖ డీఈ మస్తాన్‌రావు, ఎంపీడీవో సింగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
309 మంది విద్యార్థినులకు సైకిళ్లు అందజేత..
అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యుత్ శాఖ మంది గొట్టిపాటి రవికూమార్ 309 మంది ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు నూతన సైకిళ్లు అందజేశారు. నియోజకవర్గంలోని మిగతా పాఠశాలలలోని విద్యార్థినులకు సైకిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


