నేల కొరిగిన నాలుగు విద్యుత్ స్తంభాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అమరావతి రోడ్, ఆంజనేయస్వామి గుడి వద్ద వీధి లైట్ల కోసం వేసిన నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో తక్షణమే సరఫరా నిలిపివేశారు. స్తంభాలు కూలడంతో అమరావతి రోడ్‌లో ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సంబంధిత అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది స్తంభాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.
తప్పిన పెను ప్రమాదం
అప్రమత్తమైన కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులు


