బీపీ, షుగర్‌లను అదుపులో పెట్టుకోవాలి
అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి. ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తగినంత తీసుకోవాలి.
–డాక్టర్ రేవూరి హరికృష్ణ,
ఇన్‌ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.


