గుంటూరు డీఆర్‌ఎంగా సుథేష్ఠ సేన్ బాధ్యతల స్వీకరణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు డీఆర్‌ఎంగా ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్) సుధేష్ఠ సేన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాజా మాజీ డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ సుథేష్ఠకు బాధ్యతలు అప్పగించారు. ఎం.రామకృష్ణ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్‌కు ప్రిన్సిపల్ చీఫ్ సెఫ్టి ఆఫిసర్‌గా వెళ్లనున్న విషయం తెలిసిందే. సేన్ దక్షిణ మధ్య రైల్వేలో 1996 బ్యాచ్‌కు చెందిన వారు. ఆమె ఎకనామిక్స్‌లో ఆనర్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పబ్లిక్ పాలసీలో మాస్ట్‌ర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తొలుత ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు ఎంపికై ముంబై సెంట్రల్ రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్‌కత్తాలోని వెస్ట్ సెంట్రల్ రైల్వేల్లో పని చేశారు. అత్యంత నిష్ణాతులైన అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వేలో ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏ అండ్ సీఏఓ)గా పని చేశారు. ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, భారత ప్రభుత్వంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, ఎన్‌సీఈఆర్‌టీగా డెప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిశారు.
పోలీస్ విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి
ఒంగోలు టౌన్: మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు విచారణాధికారి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట గుంటూరు జీజీహెచ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆమెను 5వ నిందితురాలిగా చేర్చి విచారణ చేస్తున్నారు. సోమవారం ఉదయం విచారణకు వచ్చిన ఆమెను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాజరుకావాలని చెప్పారు. తొలిరోజు సుమారు నాలుగున్నర గంటల పాటు విచారించారు. విచారణలో ఆమె సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం కూడా ఆమె విచారణకు హాజరుకానున్నారు.
గుంటూరు డీఆర్‌ఎంగా సుథేష్ఠ సేన్ బాధ్యతల స్వీకరణ


