పచ్చ మద ్దత్తు! | - | Sakshi
Sakshi News home page

పచ్చ మద ్దత్తు!

Apr 8 2025 10:52 AM | Updated on Apr 8 2025 10:52 AM

పచ్చ మద ్దత్తు!

పచ్చ మద ్దత్తు!

ప్రజలను మత్తులో ముంచెత్తి అందినకాడికి దండుకోవడమే పనిగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరోవైపు ఇప్పటికే దాదాపుగా అన్ని మద్యం దుకాణాలు దక్కించుకున్న పచ్చనేతలు ఇప్పుడు బెల్టుషాపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి వత్తాసు పలుకుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ దేవదత్తును కలెక్టర్‌ సరెండర్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎటూ తేల్చకపోవడంజిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మామూళ్ల మత్తు..
● పచ్చ నేతల ఆదేశాలతో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ● వసూళ్ల పర్వంలో కుమ్ములాటలు ● వర్గాలుగా విడిపోయిన అధికారులు ● రచ్చ రోడ్డెక్కడంతో సూపరింటెండెంట్‌ దేవదత్తును సరెండర్‌ చేసిన కలెక్టర్‌ ● సరెండర్‌ నిర్ధారించని కమిషనరేట్‌ ● త్రిశంకు స్వర్గంలో దేవదత్తు.. కొనసాగుతున్న సస్పెన్స్‌ ● ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వెంకటేశ్వర్లు ● పచ్చనేతల అండతో తిరిగి బాపట్ల వచ్చేందుకు దేవదత్తు యత్నం

మామూళ్ల వ్యవహారంలోనే ..

జిల్లాలో 117 సాధారణ, 10 కల్లుగీత కార్మికుల దుకాణాలతో కలిపి మొత్తం 127 మద్యం దుకాణాలు ఉన్నాయి. దాదాపు అన్ని దుకాణాలు పచ్చనేతల స్వాధీనంలోనే ఉన్నాయి. వీరు జిల్లావ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్టు దుకాణాలు నెలకొల్పారు. మద్యం దుకాణాల్లో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా, బెల్టుషాపుల్లో రూ.50 నుంచి రూ.80 అధికంగా విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాల్లో డిమాండ్‌ ఉన్న బ్రాండ్లను బయటకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్టు షాపులపై మొక్కుబడిగా దాడులు చేసి ఒక్కో దాడికి రూ. 50 నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా షాపులను ఎక్కువ సమయం వ్యాపారం చేసుకునేలా అనుమతిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా జిల్లాలోని ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.15 వేల చొప్పున 127 షాపుల నుంచి నెలకు రూ.20 లక్షలు వసూలు చేస్తున్నారు. అంతటితో వదలక ప్రతి ఎకై ్సజ్‌ పోలీసుస్టేషన్‌కు నిత్యం టీ, కాఫీలు మొదలు భోజనాలు, చికెన్‌, మటన్‌, ఫిష్‌ సైతం మద్యం షాపుల సిండికేట్‌ నుంచే తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో నాటుసారా తయారీ దారుల నుంచి నెల మామూళ్లు పుచ్చుకొని నియంత్రణను గాలికొదిలారు. అన్నిరకాల వసూళ్లతో కలుపుకొంటే జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్‌ శాఖ నెలకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నెల మామూళ్ల పంపకాల్లోనూ దేవదత్తు, మిగిలిన అధికారులకు మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ దేవదత్తుకు వ్యతిరేకంగా ఉన్న కొందరు ఎకై ్సజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరవేసినట్లు ప్రచారం ఉంది. మద్యం ధరలు, బెల్టు షాపులు, నాటుసారా వ్యవహారాలపై ప్రజలు లేదా ప్రజాసంఘాలు ఫిర్యాదు చేసినా ఎకై ్సజ్‌ విభాగం ఏ మాత్రం స్పందించడం లేదు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు కావడం, నాటు సారా ఏరులై పారడం, మద్యం షాపులు నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమ వ్యాపారాలు సాగించడానికి ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ దేవదత్తే కారణమని, ఈ విషయమై తాను పదేపదే చెప్పినా విధుల్లో అలసత్వంగా ఉన్నారంటూ జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి ఆయనను ఎకై ్సజ్‌ కమిషన్‌రేట్‌కు సరెండర్‌ చేశారు. ఈ మేరకు గత నెల 24న లేఖ రాశారు. అదే సమయంలో అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న వెంకటేశ్వర్లుకు ఇన్‌చార్జిగా ఆ బాధ్యతలు అప్పగించారు. లేఖ రాసి దాదాపు రెండు వారాలు అవుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

అండగా కీలక నాయకులు

వాస్తవానికి దేవదత్తు జిల్లా అధికారి కావడంతో ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎకై ్సజ్‌ మంత్రికి తెలియకుండా ప్రిన్సిపల్‌ సెక్రటరీ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం లేదు. ఇదే అదునుగా దేవదత్తు ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుతో ఎకై ్సజ్‌ మంత్రిని కలిసినట్లు సమాచారం. జిల్లాలో బెల్టుషాపులు అధికంగా పెట్టించానన్న కారణంతోనే కలెక్టర్‌ తనను సరెండర్‌ చేశారని, పచ్చ పార్టీ నేతల కోసమే తాను ఆ నిర్ణయం తీసుకున్నానంటూ దేవదత్తు మంత్రి వద్ద మొర పెట్టుకున్నట్లు సమాచారం. పైగా జిల్లా మంత్రులు గొట్టిపాటి, అనగానిలతోపాటు మిగిలిన ఎమ్మెల్యేలతోనూ దేవదత్తు ఎకై ్సజ్‌ మంత్రికి సిఫార్సు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలపై దేవదత్తుకు వ్యతిరేకంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇదే సమయంలో కలెక్టర్‌ సరెండర్‌ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేయించుకొని తిరిగి బాపట్లకు సూపరింటెండెంట్‌గా వచ్చేందుకు దేవదత్తు పావులు కదుపుతున్నారు. ఇందుకు జిల్లాకు చెందిన ఒక మంత్రితోపాటు మద్యం షాపులు అధికంగా దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేవదత్తు కొనసాగితే బెల్టు షాపులు ఏర్పాటు, నిబంధనల్లో సడలింపు ఉంటుందని, అధిక ధరలకు మద్యం విక్రయించుకోవచ్చని వారు కలెక్టర్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో కలెక్టర్‌ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement