జెడ్పీ పాఠశాలలో భోజనశాల ప్రారంభం
జె.పంగులూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం భోజనశాల ప్రాంభించారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ హైవే ఇంటరైజ్ వారు సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా రూ.15 లక్షలతో భోజనశాలను నిర్మించారు. బాల బాలికలు కూర్చోని భోజనం చేసేందుకు వీలుగా స్టీల్ బెంచీలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిలుగా సింహపురి ఎక్స్‌ప్రెస్ హైవే, ప్రాజెక్ట్ హెడ్ శివకుమార్, ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ ఆనంద్, రౌండ్ టెబుల్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి వెంకటేష్‌లు హాజరై భోజనశాలను ప్రారంభించారు. హెచ్‌ఎం ఇమ్మిడిశెట్టి అనిత మాట్లాడుతూ భోజనశాలలో 450 మంది విద్యార్థులు సౌకర్య వంతంగా భోజనం చేయవచ్చన్నారు. గ్రామ పెద్ద చింతల సహదేవుడు, పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ గోలి సంధ్యారాణి, గ్రామ సొసైటీ అధ్యక్షుడు బత్తుల వెంకట్రావు పాల్గొన్నారు.


