నివేశన స్థలం కబ్జాకు కూటమి నేత పథకం
రెవెన్యూ, పోలీస్ అధికారుల ఓవరాక్షన్
బల్లికురవ: మండలంలోని రామాంజనేయ పురం గ్రామంలో దళితులకు సంబంధించిన నివేశన స్తలాన్ని గ్రామ కూటమి నేత కబ్జా చేసేందుకు పథకం వేసుకున్నాడు. ఈ పథకానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకారం అందించటంతో శుక్రవారం రాత్రి రాళ్లు వేసేందుకు ప్రయత్నించాడు. స్థల యజమాని బైటు చిన్నామ్మాయి ఈ స్థలం అనాధ పిల్లలకు సంబంధించిందని, అనాధలకు అన్యాయం చేస్తారా అని అధికారుల ముందు వాపోయింది. ఈ స్థలం విషయమై అనాధ పిల్లలకే చెందాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు విన్నవించినా కూటమి నేతలకే మద్దతు ఇస్తున్నారని వాపోయింది. దళితులమైన తాము వైఎస్సార్‌సీపీకి ఓటు వేశామన్న అక్కసుతోనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితురాలు వాపోయింది.
జెడ్పీ పీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేయాలి
గుంటూరుఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల వేతనా ల్లో నుంచి మినహాయిస్తున్న నిధులు సకాలంలో జెడ్పీ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసుకు ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలోని సీఈవో చాంబర్లో జ్యోతిబసును కలిసి ఎస్టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్లు కమతం ఉన్నారు.


