పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కోన
బాపట్ల : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి అవకాశం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 33 మందిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో అవకాశం కల్పించగా బాపట్ల జిల్లా నుంచి కోన రఘుపతికి అవకాశం లభించింది. ఈమేరకు కోన రఘుపతికి పలువురు అభినందనలు తెలిపారు.
శింగరకొండపై శంఖు చక్ర నామాలు ఏర్పాటు
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండపైనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆవరణలో నూతనంగా శంఖు, చక్ర, నామాలు, ఆంజనేయస్వామి విగ్రహాలను సిమెంట్‌తోఏర్పాటుచేశారు. వీటిని పట్టణానికి చెందిన నాగసూరి రామారావు తన సొంత నిధులతో ఏర్పాటు చేయించారు. శనివారం ఆ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలతోపాటు, సుదర్శన యాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది దాతలు పాల్గొన్నారు.
నృసింహుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
మంగళగిరిటౌన్ : మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామిని దర్శించేందుకు క్యూలో బారులుదీరారు. నృసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. తొలుత ఆలయ ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కోన
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కోన


