చీరాలలో కార్డెన్ సెర్చ్
కుట్టు మిషన్ ద్వారా స్వయం ఉపాధి
అలరించిన కళాంజలి నాటకోత్సవాలు
చీరాల అర్బన్: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో ఐదురోజులు పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక కస్తూరిభా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహించారు. శనివారం రాత్రి డాక్టర్ రాయని హనుమంతరావు కళావేదికపై విజయవాడకు చెందిన త్రిధారా ది ఆర్ట్స్ ల్యాండ్స్ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీరామ పట్టాభిషేకం నృత్య రూపకం ప్రదర్శించారు. చిన్నారులచే ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత వడలి రాధాకృష్ణకు సత్కారం నిర్వహించారు. అలానే సహృదయ, ద్రోణాదుల వారిచే వర్క్ ఫ్రం హోమ్ హాస్యనాటికను ప్రదర్శించారు. నాటికకు రచన అద్దేపల్లి భరత్‌కుమార్, దర్శకత్వం డి.మహేంద్ర వ్యవహించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఐదు రోజులు పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావులు తెలిపారు.
మేడికొండూరులో పోక్సో కేసు
మేడికొండూరు : మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఓ పోక్సో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మందపాడు గ్రామానికి చెందిన గంగోలు రాజు అదే గ్రామంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 52 ఏళ్ల గంగోలు రాజుపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చీరాల: జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మొయిన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం చీరాల టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్, న్యూకాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. చీరాల సబ్ డివిజన్‌కు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు. నాటుసారా, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే ఉద్దేశంతో నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో భాగంగా తీవ్ర గాలింపులు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. భూమిలోపల గుంతలు తీసి డ్రమ్ములలో నిల్వ ఉంచిన 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడులలో చీరాల ఒన్‌టౌన్, టూ టౌన్, ఈపూరుపాలెం, వేటపాలెం, ఇంకొల్లు, మేదరమెట్ల ఎస్సైలు, సబ్ డివిజన్‌లోని 150 మంది పోలీసులు పాల్గొన్నారు.
సరైన పత్రాలు లేని 33
ద్విచక్రవాహనాలు, ఆరు ఆటోలు సీజ్
5వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
చీరాలలో కార్డెన్ సెర్చ్
చీరాలలో కార్డెన్ సెర్చ్


