చీరాల న్యాయవాదికి సముచిత స్థానం
చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధిగా చీరాల ఐక్యనగర్‌కు చెందిన న్యాయవాది కె.ప్రసన్న ఎంపికవ్వడం గర్వకారణమని ఏపీ బహుజన్ లాయర్స్ ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో మహిళా ప్రతినిధిగా ఎంపికై టన న్యాయవాది ప్రసన్నను ఏపీ బహుజన్ లాయర్స్ ఫోరం సభ్యులు, పార్టీ కార్యకర్తలు సత్కరించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో మహిళా ప్రతినిధిగా న్యాయవాది ప్రసన్న ఎంపికవ్వడం మంచి పరిణామమని కొనియాడారు. నిరుపేదలతో పాటు పార్టీ పక్షాన నిలబడి ఉచితంగా న్యాయ సేవలందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా, నియోజకవర్గ బాధ్యులు జగన్మోహనరావు, మార్కు, న్యాయవాదులు సీహెచ్. మస్తాన్‌రావు, ఎ.విశ్వేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


