భక్తిశ్రద్ధలతో శతాబ్ది ఉత్సవాలు
బాపట్ల: పట్టణంలోని ఎస్‌ఎన్‌పీ అగ్రహారంలో వేంచేసియున్న శ్రీరామలింగేశ్వరస్వామి శతాబ్ది ఉత్సవాలు మూడోరోజు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం శత చండీయాగం, మహా రుద్రయాగం చేపట్టారు. 484 రుద్రమంత్రంతో అభిషేకం, 500 మంది మహిళామణులచే కోటి కుంకుమార్చన నిర్వహించారు. ప్రవచన కర్త అవధాన సరస్వతి ఈట తాతా సందీప్ శర్మ ప్రవచనం చేశారు. సాయంత్రం స్వామి వారి శతాబ్ది మహోత్సవ శోభయాత్ర జరిగింది. బ్రహ్మశ్రీ తాళ్లపాక మణికంఠ శివాచార్య స్వామి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొల్లిపర ప్రసాద్ స్వామి, గూడూరు చిట్టిబాబు, సాయి వెంకట్, పంగులూరి కౌండిన్య, నెమలికంటి హనుమంతరావు అర్చక సహకారంతో కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
భక్తిశ్రద్ధలతో శతాబ్ది ఉత్సవాలు


