శైవక్షేత్రాల్లో కార్తిక కళ | - | Sakshi
Sakshi News home page

శైవక్షేత్రాల్లో కార్తిక కళ

Nov 6 2025 8:14 AM | Updated on Nov 6 2025 8:14 AM

శైవక్

శైవక్షేత్రాల్లో కార్తిక కళ

అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరారామంలో శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వర ఆలయంలో కార్తిక పౌర్ణమి పర్వదినమైన బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి కుంకుమార్చనలు చేశారు. మధ్యాహ్నం నుంచి అమరేశ్వరాలయం, అమరేశ్వర స్నానఘాట్‌లలో భక్తుల సందడి నెలకొంది. సాయంత్రం నాలుగు గంటల వరకు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి అనంతరం విశేషాలంకారం చేశారు.

కోటప్పకొండలో భక్తుల రద్దీ

నరసరావుపేట రూరల్‌: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ బుధవారం భక్తులతో కళకళలాడింది. వేల మంది భక్తులు త్రికోటేశ్వరుడిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూజలు జరిపారు. క్యూలైన్‌లు కిక్కిరిశాయి. రావి చెట్టు, మహానందీశ్వరుడు, ఉసిరి చెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. సోపాన మార్గంలో మెట్లపూజ చేసుకుంటూ కొండమీదకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.

శైవక్షేత్రాల్లో కార్తిక కళ1
1/2

శైవక్షేత్రాల్లో కార్తిక కళ

శైవక్షేత్రాల్లో కార్తిక కళ2
2/2

శైవక్షేత్రాల్లో కార్తిక కళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement