
మాట్లాడుతున్న చిన్నతరహా పరిశ్రమల డైరెక్టర్ ఆఫ్ జనరల్ స్వరూప
చండ్రుగొండ: ఆదివాసీల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకే మారుమూల గ్రామమైన బెండాలపాడులో బ్యాంబో క్లస్టర్ ఏర్పాటు చేసినట్లు జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల డైరెక్టర్ ఆఫ్ జనరల్ గ్లోరి స్వరూప తెలిపారు. మండలంలోని బెండాలపాడు గ్రామశివారులో ప్రకృతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల పరిశ్రమను ఆమె బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో వెదురు ఉత్పత్తి అధికంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభివృద్ధి సంస్థ చైర్మన్ నేతాజి, సూర్యప్రకాష్, ప్రకృతి సంస్థ చైర్మన్ జయశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లయ్య, బాణోత్ పార్వతి, పూసం వెంకటేశ్వర్లు, బొర్రా లలిత, బ్యాంబో క్లస్టర్ ప్రెసిడెంట్ ఈసం నాగభూషణంతోపాటు బాలరాజు, రమేష్, బొర్రా సురేష్, దారం గోవిందరెడ్డి, సయ్యద్ సర్దార్, ఫజల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment