ఇల్లెందురూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడు జి.శేఖర్‌కు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందించింది. కేయూ చరిత్ర, టూరిజం మేనేజ్‌మెంట్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ పోలవరపు హైమావతి పర్యవేక్షణలో ‘డిప్లమసి ఆఫ్ ది రాయస్ ఆఫ్ ది విజయనగర 1336–1565’ అనే పరిశోధన అంశంపై శేఖర్ వైవా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్నప్పయ్య మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే ఐదుగురు అధ్యాపకులు డాక్టరేట్ పొందారని, తద్వారా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది డాక్టరేట్ పట్టా అందుకున్న చరిత్ర ఇల్లెందు కళాశాలకు దక్కిందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రావు, అధ్యాపకులు శ్రీదేవి, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వెంకటేశ్వరరావు, రాకేష్ శ్రీరాం, రాజు, శేఖర్, ఈశ్వర్, సురేందర్, సరిత, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, లక్ష్మణ్‌రావు, సుజాత, యువకుమార్ పాల్గొన్నారు.


