ప్రభుత్వ పాఠశాలకు సామగ్రి వితరణ
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత బాలికల పాఠశాలకు సింగరేణి కేపీయూజీ మైన్‌కు చెందిన ఎస్‌ఎంఎస్ ప్రైవేట్ సంస్థ రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేసింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌ఎంఎస్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా బెంచీలు, టేబుల్స్, కుర్చీలు, గ్లాసులు, ప్లేట్‌లు అందించిందని తెలిపారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో వితరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణజ్యోతి, ఎస్‌ఎంఎస్ ప్లాంట్ జీఎం కో ఆర్డినేటర్ సీవీ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు ఉన్నారు.
రూ.3 లక్షల విలువైన బెంచీలు, కుర్చీలు
అందించిన ఎస్‌ఎంఎస్ సంస్థ


