మొగలాయిలను ఎదిరించిన వీరుడు
సూపర్‌బజార్(కొత్తగూడెం): హస్తిన పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన తొలి తెలంగాణ తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించి సమ సమాజ స్థాపనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్భాందవుడు అని, క్షత్రియుడే కత్తి పట్టాలన్న సూత్రాన్ని ఆయన మార్చారని, సబ్బండ వర్గాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సభలో అదనపు కలెక్టర్


