ప్రారంభానికి మ్యూజియం సిద్ధం
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉందని పీఓ బి.రాహుల్ తెలిపారు. యూనిట్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి అందరికీ తెలిసేలా మ్యూజియంలో సుందర దృశ్యాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 6న మ్యూజియాన్ని ప్రారంభించనుండగా ఈలోగా జీసీసీ, వ్యవసాయ ఉత్పత్తుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు చంద్రశేఖర్, సున్నం రాంబాబు, ఉదయభాస్కర్, ఉదయ్ కుమార్, రమణయ్య, అశోక్ కుమార్, గోపాలరావు, నరేష్, వేణు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


