దమ్మపేట: అతివేగంతో ప్రయాణిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని పట్వారిగూడెంశివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మపేట అర్బన్‌కాలనీకి చెందిన గాజుబోయిన ప్రశాంత్‌కుమార్ (19) తాపీ పనిచేస్తుంటాడు. శుక్రవారం సొంత పనిమీద బైక్‌పై దమ్మపేట నుంచి కొత్తగూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. మండలంలోని పట్వారిగూడెం శివారుకు రాగానే పాల్వంచ వైపుకు అతివేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రశాంత్‌కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి తల్లి, సోదరి ఉన్నారు. చేతికందిన కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తల్లి శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.


