రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌

Apr 22 2025 12:26 AM | Updated on Apr 22 2025 12:26 AM

రేణుక

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌

బూర్గంపాడు/పాల్వంచ: మండలంలోని అంజనాపురానికి భూక్యా రేణుక జ్యోతిష్యంలో ఆర్యన్‌ పరిశోధన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. ఆమె భర్త కిరణ్‌గాంధీ డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వివాహ సంతాన అంశంలో పరిశోధన చేసినందుకు గాను రేణుకకు ఈనెల 20న సింహాచలంలో జరిగిన జ్యోతిష్య సదస్సులో డాక్టర్‌ నరసింహస్వామి, తదితరుల చేతుల మీదుగా డాక్టరేట్‌ అందించారు.

ఇంటి కొలతల్లో తేడాలు రాకుండా చూడాలి

పాల్వంచరూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన ఇంటి కొలతల్లో తేడాలు రాకుండా చూడాలని గ్రామ కార్యదర్శులను హౌసింగ్‌ బోర్డు పీడీ శంకర్‌ ఆదేశించారు. మండల పరిధిలోనితోగ్గూడెంగ్రామపంచాయతీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లనుసోమవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తేనే బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందుతాయన్నారు. ఇప్పటివరకు గ్రామంలో వంద ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని కార్యదర్శి రవికుమార్‌ పీడీకి వివరించారు.

న్యాయవాద సంక్షేమ నిధి పెంచాలి

కొత్తగూడెంటౌన్‌: న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ కార్పస్‌ ఫండ్‌ రూ. 100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని ఏఐఎల్‌యూ జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్‌ మక్కడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ సమావేశంలో మాట్లాడారు. న్యాయవాదులకు ఇన్సూరెన్స్‌, హెల్త్‌ కార్డులను అందజేయాలని, ఇన్సూరెన్స్‌ను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. తొలుత సంక్షేమ నిధి పెంచాలని సంతకాల సేకరణ చేశారు. కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌ జె.శివరాంప్రసాద్‌, న్యాయవాదులు కిలారు పురుషోత్తం, గాదె సునంద, అరికాల రవికుమార్‌, డి.రాజేందర్‌, వైవీ రామారావు, ఏ.పద్మకళ, పగిడిపల్లి రవి, దేవదాసు, రామకృష్ణ, మహేష్‌, ఆనంద్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

తాగునీటి సమస్య

ఎదరుకావొద్దు

డీపీఓ చంద్రమౌళి

దమ్మపేట: వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అఽధికారి చంద్రమౌళి గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కనీసం వంద మంది ఉపాఽధి హామీ పనులకు వచ్చేలా చూడాలన్నారు. ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, ఎంపీఓ రామారావు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడం

కూల్చివేతకు యత్నం

ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఒడ్డున అక్రమంగా చేపట్టిన నిర్మాణం కూల్చివేతకు మున్సిపల్‌ అధికారులు సోమవారం యత్నించారు. వాగు ఒడ్డున ఓ గది నిర్మాణం తలపెట్టగా మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, సిబ్బంది, జేసీబీతో అక్కడికి వెళ్లి కూల్చివేతకు ప్రయత్నించారు. దీంతో నిర్మాణదారులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం కొంత గడువు ఇస్తే తామే తొలగిస్తామని నిర్మాణదారులు పేర్కొనడంతో పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వెనుదిరిగారు.

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌1
1/3

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌2
2/3

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌3
3/3

రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement