
సొసైటీ సిబ్బందితో రైతుల వాగ్వాదం
టేకులపల్లి: టేకులపల్లిలోని బేతంపూడి సొసైటీ కార్యాలయం వద్ద శనివారం రైతులకు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలానికి చెందిన ఓ రైతుకు కారేపల్లి మండలంలో సాగు భూమి ఉంది. ఆ భూమి పత్రాలతో యూరి యా తీసుకునేందుకు రాగా ఇచ్చేందుకు ఏఓ నిరాకరించారు. రెండు బస్తాలకు పైగా యూరియా తీసుకున్న వారు నానో యూరియా బాటిల్ తీసుకోవాల ని సొసైటీ సిబ్బంది మెలిక పెడుతున్నారు. ఈ క్రమంలో రైతులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది. క్యూలో ఉన్నవారికి ఇవ్వకుండా, పైరవీలు చేసేవారికి యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. కాగా నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ జరుగుతోందని సొసైటీ సీఈఓ ప్రేమాచారి తెలిపారు. చైర్మన్ సురేందర్‌రావు జోక్యం చేసుకుని రైతులను శాంతింపజేశారు.