
‘మల్బరీ’తో ఆదాయం మెరుగు
మల్బరీ సాగుకు రాయితీ (యూనిట్‌కు రూ.ల్లో)
రైతులకు వర ప్రదాయిని
● రెండు ఎకరాల్లో పంట సాగు చేస్తే రూ.7 లక్షల వరకు రాబడి ● ఉద్యానశాఖ ద్వారా రైతులందరికీ రాయితీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు సంప్రదాయ పంటలవైపు దృష్టి సారిస్తే ఆర్థికంగా ఎదుగుతారని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన సందేశంలోనూ మిర్చి, పత్తి పంటలే కాకుండా రైతులు ఉద్యాన, ఇతర పంటల వైపు దృష్టి సారించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని పిలుపునిచ్చారు. రాయితీలు కూడా ఎక్కువగా ఉంటాయ ని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రాయితీల గురించి సరైన అవగాహన లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. రాయితీల వల్లే ఇటీవల జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు పెరుగుతోంది. తాజాగా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీసాగుతో అధిక నికర ఆదాయం పొందవచ్చని రైతులను చైతన్యం చేస్తున్నారు. మల్బరీ సాగుకు ఇస్తున్న రాయితీలను ప్రకటించారు. రెండెకరాలను యూనిట్‌గా పరిగణించనున్నట్లు అధికారులు తెలిపారు. యూనిట్‌కు రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఓసీ, బీసీ రైతులకు రూ 4,65,456, ఎస్సీ రైతులకు రూ 6,00,456, ఎస్టీ రైతులకు రూ 6,00,456 రాయితీని ఉద్యాన శాఖ ద్వారా అందించనున్నారు.
వివరాలు ఓసీ/బీసీ ఎస్సీ ఎస్టీ
మల్బరీ మొక్కలు నాటేందుకు 60,000 78,000 78,000
బిందు సేద్యం నిమిత్తం 50,000 65,000 65,000
పట్టు పురుగుల రేరింగ్ షెడ్‌కు 2,25,000 2,92,500 2,92,500
రేరింగ్ స్టాండ్స్ నిర్మాణానికి 15,456 26,706 26,706
పట్టు పురుగులు పెంచే
ఇతర పరికరాలకు 37,500 37,500 37,500
రోగ నిరోధక మందులకు 2,500 3,250 3,250
కిసాన్ నర్సరీ 75,000 97,500 97,500
మొత్తం 4,65,456 6,00,456 6,00456
మల్బరీసాగు రైతులకు వరప్రదాయిని. సంప్రదాయ పంటలను విడనాడి అధిక ఆదాయం సాధించేందుకు ఉద్యాన పంటలు సాగు చేయాలి. అవగాహన పెంచుకుని ఉద్యాన పంటల వైపు రైతులు దృష్టి సారించాలి.
–జంగా కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టు
పరిశ్రమ శాఖాధికారి

‘మల్బరీ’తో ఆదాయం మెరుగు